ETV Bharat / city

కొవిడ్ ఎమర్జెన్సీ: సర్కారుకు దన్నుగా తూర్పు నౌకాదళం - Eastern Navy backs to the AP Government news

రాష్ట్రంలో ఆక్సిజన్‌ నిల్వలు, ఉత్పత్తి, సరఫరాపై విశాఖపట్టణం తూర్పు నౌకాదళం, స్టీల్‌ ప్లాంట్‌ సీఎండీలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం తరుపున రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, కొవిడ్‌ నోడల్‌ అధికారి ఎం.టి.కృష్ణబాబు చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో తూర్పు నౌకాదళం ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ చేపట్టనుంది.

సర్కారుకు దన్నుగా తూర్పు నౌకాదళం
సర్కారుకు దన్నుగా తూర్పు నౌకాదళం
author img

By

Published : May 8, 2021, 1:05 PM IST

ఆక్సిజన్‌ ప్లాంట్లు, లీకేజీలు, స్థితిగతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు ఈఎన్‌ఈ ముందుకొచ్చింది. దీనికోసం అత్యవసరంగా నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఒక్కో బృందం మూడు నుంచి నాలుగు జిల్లాల్లో నిర్వహణా బాధ్యతలు పర్యవేక్షిస్తుంది. ఎక్కడ అవసరమైతే అక్కడకి ఈ బృందాలను వాయుమార్గంలో తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయాలు, ఇతర ఇబ్బందులను నౌకాదళ బృందాలు పరిష్కరించనున్నాయి. ఆక్సిజన్‌ ప్లాంట్లలో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం చేసేందుకు నౌకాదళం అంగీకరించింది.

సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియాల నుంచి రాష్ట్రానికి రానున్న ఆక్సిజన్‌తో కూడిన 25 క్రయోజనిక్‌ కంటైనర్స్‌ను తరలించేందుకు నౌకాదళం అంగీకరించింది. రోజువారీ అవసరాల కోసం లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ కంటైనర్స్‌ను తరలించేందుకు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చేందుకు నేవీ అధికారులు ఆమోదం తెలిపారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్, డి-టైప్‌ ఆక్సిజన్‌ సిలిండర్లతోపాటు కొవిడ్‌ చికిత్సకు అవసరమైన ఇతర వైద్య పరికరాల సరఫరాకు నేవీ అధికారులు అంగీకారం తెలిపారు. ఐఎన్‌ఎస్‌ కళింగ ఆసుపత్రిలో 10 ఆక్సిజన్‌ బెడ్స్‌తో పాటు 60 పడకలను చికిత్స కోసం కేటాయించేందుకు తూర్పు నౌకాదళం అంగీకరించింది.

అదనంగా.. విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలో 150 పడకల తాత్కాలిక ఆసుపత్రి కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సమ్మతించింది. ఇందుకు అవసరమైన వైద్యులు, పారా మెడికల్‌ స్టాఫ్​ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 200 డి-టైప్‌ సిలిండర్ల అందించేందుకు నేవీ ముందుకొచ్చింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కొవిడ్‌ చికిత్స కోసం అదనపు పడకల ఏర్పాటుకు ముందుకొచ్చింది. 850 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన రెండు యూనిట్లుకు గాను కేవలం 100 మెట్రిక్‌ టన్నుల ఎంఎల్‌ఓ ఉత్పత్తి అవుతుందని స్టీల్‌ ప్లాంట్‌ అధికారులు తెలిపారు. 2013లో ఈ ప్లాంట్‌ పూర్తైనప్పటికీ... కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీతో సంప్రదింపులు పూర్తి కాలేదని ఆర్‌ఏఎన్‌ఎల్‌ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం సంప్రదింపులు పూర్తైన దృష్ట్యా 6 నెలల్లో ప్లాంటు అందుబాటులోకి వస్తుందని స్టీల్‌ ప్లాంట్‌ అధికారులు పేర్కొన్నారు. వారం రోజుల్లో ప్లాంట్‌ స్థితిగతులపై కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీకి చెందిన ప్రత్యేక బృందం అధ్యయనం చేయనుందని చెప్పారు. ఈ ప్లాంట్‌ సందర్శనకు అంగీకరించిన నావల్‌ డాక్‌యార్డు అధికారులు, కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీకి అవసరమైన సహాయానికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌ అందుబాటులోకి రానప్పటికీ భవిష్యత్తు అత్యవసరాలకు గణనీయంగా ఉపయోగపడుతుందని స్టీల్‌ ప్లాంట్‌ అధికారులు వివరించారు.

విశాఖ గురజాడ కళాక్షేత్రంలో కొవిడ్‌ చికిత్స కోసం ఆక్సిజన్‌తో కూడిన 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు స్టీల్‌ ప్లాంట్‌ అంగీకారం తెలిపింది. వీటికి అదనంగా మరో 150 పడకలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. మే 15 నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని స్టీల్‌ ప్లాంట్‌ సీఎండీ తెలిపారు. మే 30 నాటికి 250 పడకలు, జూన్‌ 2021 నాటికి 600 పడకలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్టీల్‌ ప్లాంటు అధికారులు తెలిపారు. అందుకు తగిన విధంగా వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులోకి వచ్చేలా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని స్టీల్‌ ప్లాంట్‌ అధికారులు కోరారు. నేవీ, స్టీల్‌ ప్లాంట్‌ అధికారుల విజ్ఞప్తి మేరకు వారి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల కోసం 4000 వాక్సిన్స్‌ను కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి స్టీల్‌ ప్లాంట్, తూర్పు నౌకాదళ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:

రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా.. ఊరూరా నిరీక్షణలే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.