ETV Bharat / city

Chinna Jeeyar: నృసింగహ సాఫ్ట్​ స్కిల్స్​ ప్రాజెక్టు ప్రారంభించిన చినజీయర్​ స్వామి - నృసింగహ సాఫ్ట్​ స్కిల్స్​ ప్రాజెక్టు ప్రారంభించిన చినజీయర్​ స్వామి

Nrusingha Soft Skills Project launched: డాక్టర్​ చల్లా కృష్ణవీర్​ అభిషేక్ రూపొందించిన నృసింగహ సాఫ్ట్​ స్కిల్స్​ ప్రాజెక్టును విశాఖలో త్రిదండి చినజీయర్‌ స్వామి ప్రారంభించారు. సాఫ్ట్​ స్కిల్స్​.. అత్యుత్తమ వ్యక్తిగా ఎదిగేందుకు దోహదపడుతాయని చినజీయర్​ అంతకుముందు సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవంలో చినజీయర్​ పాల్గొన్నారు.

చినజీయర్​ స్వామి
చినజీయర్​ స్వామి
author img

By

Published : Apr 13, 2022, 9:14 PM IST

ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి సాఫ్ట్​ స్కిల్స్​ ఎంతో అవసరమని త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. సాఫ్ట్​ స్కిల్స్​ను మెరుగుపరుచుకోవడం అత్యుత్తమ వ్యక్తిగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. విశాఖ వచ్చిన చిన జీయర్.. భాషావేత్త, సెంటర్​ ఫర్​ ఎమోషనల్​ ఎడ్యుకేషనల్​ డైరెక్టర్​ డాక్టర్​ చల్లా కృష్ణవీర్ అభిషేక్​ రూపొందించిన నృసింగహ సాఫ్ట్​ స్కిల్స్​ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రపంచ దేశాలతో సంభాషించడానికి ఆంగ్ల భాషా నైపుణ్యాలు చాలా అవసరమని చిన్న జీయర్​ అన్నారు. కమ్యూనికేషన్ నైపుణ్యం పెంచుకుంటే మనలో ప్రతికూలతలను తొలగిస్తాయని.. సానుకూలతలు నింపుతాయని చెప్పారు. అనంతరం డాక్టర్​ చల్లా కృష్ణవీర్​ అభిషేక్​ మాట్లాడుతూ.. ప్రాజెక్టు లక్ష్యాలని వివరించారు. ఆధ్యాత్మిక, సంప్రదాయ బోధనలతో సాఫ్ట్​ స్కిల్స్​ అభివృద్ధి చెందుతాయని అన్నారు. ​

సింహాచలంలో వైభవంగా వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో చిన జీయర్ స్వామి పాల్గొని.. భక్తులనుద్దేశించి అను గ్రహ భాషణం చేశారు. స్వామి వారి కళ్యాణాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోలాటం, నాట్య బృందాలు… వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాయి. రథోత్సవం అనంతరం శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు.

Annual Thiru Kalyana Mahotsavam in Simhachalam
సింహాచలంలో వైభవంగా వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం

ఇదీచదవండి: ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం.. డీజీల్ సెస్ పేరుతో ఛార్జీల పెంపు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.