విశాఖలో ఇప్పటి వరకూ ఐదు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వారికి పరీక్షలు నిర్వహించగా ఆ వైరస్ దాఖలాలు లేనట్లుగా తేలిందని జిల్లా వైద్య అధికారులు చెబుతున్నారు. విశాఖ కేజీహెచ్ అంటువ్యాధుల ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ఏర్పాటు చేసి.. ప్రత్యేక వైద్య బృందాలు నియమించారు. విశాఖ ఎయిర్ పోర్టులో ప్రత్యేక అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. వచ్చే విదేశీ ప్రయాణికులకు పరీక్షలు చేసి బయటకు పంపుతున్నారు. విశాఖలో ఉన్న ఉష్ణోగ్రతలు వల్ల కరోనా వచ్చే అవకాశాలు తక్కువని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఎక్కువ మంది ఉండే ప్రాంతంలో తుమ్మడం, దగ్గడం, వంటి చర్యల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు పేర్కొన్నారు. కరచాలనం చేయడం తగ్గించాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: