తెలుగు రాష్ట్రాల్లో మూడు వేర్వేరు స్థిరాస్తి సంస్థల కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ.75 కోట్ల నల్లధనం బయటపడింది. ఈనెల 10న హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 30 ప్రదేశాల్లో సోదాలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1.20 కోట్ల నగదు, రూ.90 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు సోదాల్లో గుర్తించిన తొమ్మిది బ్యాంకు లాకర్లపై నిషేధ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపింది. డిజిటల్ ఆధారాలు, చేతి రాతతో ఉన్న పుస్తకాలు, అప్రకటిత నగదు లావాదేవీలను తెలిపే పత్రాలను స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించింది. పన్ను వర్తించే ఆదాయాన్ని తగ్గించి చూపించేలా అనేక బోగస్ క్లెయింలు చేసినట్లు ఈ ఆధారాల ద్వారా బహిర్గతమైందని తెలిపింది. ఏ సంస్థ నుంచి ఎంత నగదు? ఎంత బంగారం? స్వాధీనం చేసుకున్నామన్న వివరాల్ని అధికారులు ప్రకటించలేదు.
ఇదీ చదవండి: ఆస్తి పన్ను పోటు.. గుంటూరులో ప్రత్యేక నోటీసులు జారీ