రాష్ట్రంలోని ఓ ఎంపీ పట్ల ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తే.. సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని భాజపా నేత విష్ణు కుమార్ రాజు అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రఘురామ కృష్ణరాజు ఆరోగ్య నివేదికను ఇతర రాష్ట్రాలకు చెందిన వైద్యుల ద్వారా తయారు చేయించాలని డిమాండ్ చేశారు. ఏపీ వైద్యులు రిపోర్ట్ ఇస్తే ఆయనకు న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో ఖాళీలు.. భర్తీ ఎప్పుడు?
ప్రభుత్వ అరాచకాలను ఎత్తిచూపితే దేశ ద్రోహంగా పరిగణిస్తారా అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. కరోనా సమయంలో రాజకీయ నాయకుల అరెస్ట్లు సరికాదన్నారు. ఏపీలో శని, ఆదివారాలు సైతం కోర్టులు తెరచి ఉంచాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: