ETV Bharat / city

రఘురామ కేసును సీబీఐతో విచారణ చేయించాలి: విష్టుకుమార్ ​రాజు - cbi enquiry on ragurama incident

రఘురామను అరెస్టు చేసి భౌతిక దాడికి పాల్పడడంపై సీబీఐతో విచారణ చేయించాలని భాజపా నేత విష్టుకుమార్​ రాజు డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న కక్షపూరిత దాడులను ఆయన ఖండించారు.

bjp leader vishnukumar raju over raghurama incident
రఘురామ కేసును సీబీఐ విచారణ చేయించాలి
author img

By

Published : May 23, 2021, 5:03 PM IST

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసన చేపట్టిన భాజపా నేత విష్టుకుమార్ ​రాజు.. రఘురామ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండించారు. కరోనా సమయంలోనూ దాడులు చేయడం, కక్షపూరిత రాజకీయాలు చేయడంలో జగన్​ ప్రభుత్వం ముందుందన్నారు. సొంతపార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్​ చేసి చిత్రహింసలకు గురి చేయడాన్ని తప్పుపట్టారు.

ఎంపీ మాటలను తాను సమర్థించకపోయినప్పటికీ గౌరవప్రదమైన పదవిలో ఉన్న రఘురామను పోలీసుల కస్టడీలోనే కొట్టడం, అవమానించేలా వ్యవహరించడాన్ని ఆక్షేపించారు. నిజాలను కప్పిపుచ్చేందుకు జీజీహెచ్​ వైద్యులతో.. కోర్టుకు తప్పుడు నివేదిక ఇప్పించడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన డాక్టర్లను శిక్షించాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలకు స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణకు అవకాశం లేదని రఘురామ విషయంలో ప్రభుత్వం తీరు స్పష్టం చేస్తోందన్నారు.

సీఐడీ ఆధీనంలో ఉన్న ఎంపీపై భౌతికదాడి చేసి అవమానించడంపై సీబీఐతో విచారణ చేయించి నిజాలను బయటకు తెచ్చి.. రాష్ట్రంలో జరుగుతున్న నియంతృత్వ పాలనను అరికట్టాలని డిమాండ్​ చేశారు. దీనిలో రాజకీయ నాయకులు, పోలీసుల ప్రమేయాన్ని బయటకు తీసుకురావాలని విష్టుకుమార్​రాజు కోరారు.

ఇవీ చదవండి:

సోనాలీ బాటలో సరళ.. మమతకు క్షమాపణ

'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు..నాటు మందు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.