2,025 మెగావాట్ల సామర్థ్యంతో.. దేశంలోనే అతిపెద్ద నీటిలో తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ సిద్ధం అవుతోంది. విశాఖలోని మేఘాద్రి గడ్డ జలాశయంలో 155 ఎకరాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ను.. ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జాతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎన్టీపీసీ) సింహాద్రి యూనిట్ నిర్మిస్తున్న ఈ ప్లాంట్.. కొద్ది నెలల్లోనే విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టనుంది.
రూ. 110 కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితమే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించినా.. కొవిడ్ దృష్ట్యా అడ్డంకులు రావడంతో ప్రక్రియ నెమ్మదించింది. ప్రస్తుతం వేగంగా పనులు తిరిగి ప్రారంభించడంతో.. ఈ ప్రాజెక్టు అత్యంత త్వరగా ఏపీకి అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను మొదటగా ఏపీ అవసరాల కోసం వినియోగించుకుని.. అనంతరం ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఎన్టీపీసీ భావిస్తోంది.
ఇదీ చదవండి:
జగన్ నా తోడబుట్టిన అన్న.. ఆయన ఆశీస్సులు ఉన్నాయనే అనుకుంటా: వైఎస్ షర్మిల