కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన భూములను.. తప్పుడు పత్రాలు సమర్పించి తన బంధువులు, బినామీల పేరిట మంత్రి గుమ్మనూరు జయరాం రాయించుకున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖలో మీడియా సమావేశంలో అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు. ఆ సంస్థ నుంచి 2009లోనే బయటకొచ్చేసిన మంజునాథ్ అనే వ్యక్తి పేరిట తప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలు సమర్పించి.. వందల ఎకరాలు ముందు అతని పేరు మీద.. తర్వాత అతను మంత్రి బంధువులకు అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆ భూమిపై కర్నూలు జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో రుణం పొందేందుకు యత్నించారన్నారు.
ఇదీ చదవండి: పాఠశాలలు, ట్యూషన్లలో కరోనా వ్యాప్తి