ETV Bharat / city

విశాఖలో.. పదో తరగతి విద్యార్థిపై హత్యాయత్నం! - attack on tenth student in visakha district

దాడి
దాడి
author img

By

Published : May 6, 2022, 4:03 PM IST

Updated : May 6, 2022, 9:00 PM IST

16:01 May 06

పరీక్ష రాసి వస్తున్న విద్యార్థిపై దాడి చేసిన దుండగులు

విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. పదోతరగతి పరీక్ష రాసి వస్తున్న విద్యార్థిపై.. కొందరు యువకులు కత్తి, బ్లేడులతో దాడి చేశారు. తీవ్రగాయాలైన విద్యార్థిని.. విశాఖ కేజీహెచ్​కు తరలించారు. పాత పోస్టాఫీసు ప్రాంతంలో ఘటన జరిగింది.

రెల్లి వీధికి చెందిన ఓ బాలుడు.. పాత పోస్టాఫీసు కూడలి వద్ద ఉన్న క్వీన్ మేరీ హైస్కూల్​లో పదోతరగతి పరీక్షలను రాస్తున్నాడు. మధ్యాహ్నం పరీక్షరాసి.. ఇంటికి వెళ్తున్న సమయంలో రౌడీ షీటర్ ధోని, సతీష్, మరికొంత మంది కత్తి, బ్లేడులతో తనపై దాడి చేసి.. పరారయ్యారని బాధితుడు తెలిపారు. కొంతకాలంగా కొంతమంది రౌడీ షీటర్లు.. గంజాయి అమ్మాలని తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని.. వారి మాట వినకపోతే ఇంట్లో వారిపై ఇలా దాడికి పాల్పడుతున్నారని బాధితుడి తల్లి వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవటం లేదని ఆమె ఆరోపించారు.

దాడిపై కేసు నమోదు చేసుకున్న వన్​టౌన్​ పోలీసుల దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే.. గాయపడిన విద్యార్థిపై గతంలో హత్యాయత్నం కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం బెయిల్​పై బయటకు వచ్చి పదో తరగతి పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: అనకాపల్లి జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం..!

Last Updated : May 6, 2022, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.