ETV Bharat / city

ఏపీ పీజీ ఈసెట్- 2020 ఫలితాలు విడుదల

ఏపీ ఏపీపీజీఈసెట్-2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 87.98శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఏయూ ఉపకులపతి ప్రసాద్ రెడ్డి తెలిపారు. త్వరలోనే కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేస్తామని వెల్లడించారు. పీజీ ఈసెట్-‌ 2020 ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 87.98 శాతం ఉత్తీర్ణత సాధించారు.

AP PG ESET-2020 results released
ఏయూ ఉప కులపతి ప్రసాద్ రెడ్డి
author img

By

Published : Oct 23, 2020, 2:10 PM IST

Updated : Oct 23, 2020, 3:40 PM IST

ఏపీపీజీఈసెట్-2020 ఫలితాలను... ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలకు 28,868 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... 22,911 మంది హాజరయ్యారు. వీరిలో 20,157 మంది అర్హత సాధించినట్లు ప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రవేశాలను ఆన్​లైన్​లో నిర్వహిస్తామన్న ఆయన... ఈ ఏడాది ఆంధ్ర యూనివర్సిటీ ఈ ప్రక్రియ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. కొవిడ్ కారణంగా పరీక్ష రాయలేని వారికి... మరో సారి పరీక్ష నిర్వహిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే కౌన్సెలింగ్ తేదీలు ప్రకటిస్తామన్నారు.

ఇదీ చదవండి:

ఏపీపీఎస్సీ గ్రూప్​-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా

Last Updated : Oct 23, 2020, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.