ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తానన్న రాయితీలను వెంటనే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆస్కరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించిన ఆయన...ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని..వాటిని అమలు చేయాలని కోరారు. చాలామంది ఐఏఎస్ అధికారులు కార్యాలయానికి రావటం లేదని ఆరోపించిన ఆయన...కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు.
ఉద్యోగుల హెల్త్ కార్డులకు చాలా ఆసుపత్రుల్లో వైద్యం అందించే పరిస్థితి కనిపించటం లేదన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పూర్తి అవగాహన రాకముందే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని..వారి మీద చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వానికి ఇది తగదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీచదవండి