రాష్ట్రంలో కొత్తగా మ్యూజియం(new museums in ap)లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాధనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా విశాఖ, శ్రీకాకుళం, తిరుపతి, ఒంగోలు, ఏలూరు, అనంతపురంలో మ్యూజియంలను నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏలూరులో రూ.4 కోట్ల వ్యయంతో మ్యూజియం నిర్మాణమవుతోంది.
రాష్ట్రంలో మరో మూడు చోట్ల అంతర్జాతీయ ప్రమాణాలతో మ్యూజియంలను ఏర్పాటు చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. మైలవరం, రాజమహేంద్రవరం, కాకినాడలో మ్యూజియంలను ఏర్పాటు చేయనుంది. 2021 - 22 ఏడాదిలో ఈ నిర్మాణాలు చేపట్టాలని పర్యాటక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మ్యూజియంలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇవీ చదవండి:
Kerala Gold Smuggling: కీలక నిందితుడు అరెస్ట్
జూన్ చివరి నాటికి ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్: సింఘాల్