విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో తాజాగా మరొకరు మృతిచెందారు. స్టైరీన్ లీక్ ప్రమాదంలో తీవ్ర అస్వస్థతతో వెంకటాపురం గ్రామానికి చెందిన కడలి సత్యనారాయణ కేజీఎచ్లో చికిత్స పొందారు. అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. బంధువులు వెంటనే బాధితుణ్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులు చికిత్స తీసుకుని మళ్లీ ఇంటికి వచ్చాడు. అనంతరం మరోసారి అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ చూడండి: