ETV Bharat / city

Amruta Organic food for patients: ఆరోగ్యం కోసం.. అమృత సేంద్రీయ ఆహారం

Organic food for patients : ఓ వైపు కరోనా వంటి మహమ్మారులు మానవాళిపై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మనుషులపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ప్రజలు రోగనిరోధక శక్తి కోల్పోయి శక్తి హీనులుగా తయారవుతున్నారు. ఇలాంటి సమయంలో రసాయనాల్లేని పోషకాహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేశారు ఆ వై‌ద్యుడు. సేంద్రీయ ఆకుకూరలు, కూరగాయలతో తయారు చేసిన అమృత ఆహారాన్ని ఉచితంగా పంపిణీ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.ఎవరా వైద్యుడు ? ఏంటా సేంద్రీయ ఆహారం అంటారా...మీరే చదివేయండి...

author img

By

Published : Jan 30, 2022, 3:23 PM IST

Amruta Organic food for patients
ఆరోగ్యం కోసం.. అమృత సేంద్రీయ ఆహారం

Amruta Organic food for patients: విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ఈయన పేరు ద్వారపురెడ్డి రామ్మోహన్ రావు. భార్య కూడా వైద్యురాలు కావడంతో.. ఆమె సాయంతో కర్షక మహర్షి ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. నానాటికీ ప్రజలపై పెరుగుతున్న రుగ్మతల ప్రభావం... ఆ వైద్యుడిని ఆలోచింపజేసింది. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు... మెరుగైన వైద్య సేవలు అందించటంతో పాటు ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. పేదలకు పోషకవిలువలతో కూడిన ఆహారం అందించాలని సంకల్పించారు. వ్యాధుల నుంచి రక్షణ కోసం.. సేంద్రీయ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేపట్టారు.

ఆరోగ్యం కోసం.. అమృత సేంద్రీయ ఆహారం

అమృత ఆహార తయారీకి వినియోగించే ఆకుకూరలు, కూరగాయలను పండించడం కోసం రామ్మోహన్ రావు ఇంటిపై ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆకుకూరల సాగుకు షెడ్ నెట్ వేశారు. చెక్కలతో తయారు చేసిన కుండీల్లో తోటకూర, పాలకూర, కొత్తిమీర, ముల్లంగి, పుదీనా... ఇలా దాదాపు 13రకాల ఆకుకూరలను పండిస్తున్నారు. ఆసుపత్రితోపాటు ఇంటి ఆవరణలోనూ సేంద్రీయ ఎరువులతో కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, జీడి, ఖర్జూరం... సుమారు 30రకాలు సాగు చేస్తున్నారు. పచ్చి కూరగాయలు, ఆకుకూరలను పచ్చడిగా చేసి కొంచెం తేనె కలిపి అమృత ఆహారం తయారు చేస్తున్నారు. షోషకాహార ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యమని రామ్మోహన్‌రావు అంటున్నారు.

ఇదీ చదవండి : IT employees visit farm schools : పొలాల బాట పట్టిన ఐటీ ఉద్యోగులు.. ఎందుకంటే?

" అమృత ఆహారానికి పనికి వచ్చే ఆకుకూరలను సేంద్రీయంగా పండిస్తున్నాం. ప్రతీ 15రోజులకు ఆహారంగా స్వీకరించడానికి ఈ ఆకుకూరలు సిద్ధం అవుతాయి.రోజుకు 300-400మందికి సరపడే ఆకుకూరలను ఇక్కడ పండిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచడం, జబ్బులు రాకుండా ఉండాలంటే మంచి పోషకాహారంతోనే సాధ్యం. ఆహారమే ఔషధం. వండకుండా తినడమే ప్రస్తుత ఆరోగ్య సూత్రం. " -రామ్మోహన్ రావు, వైద్యుడు

" సేంద్రీయ పద్ధతుల ద్వారా పెంచిన ఆకుకూరలు, పప్పులను ఆహారంగా అందిస్తున్నాం. రోజుకు 30నుంచి 40 మంది వస్తున్నారు. " -ప్రతిమాదేవి, వైద్యురాలు

వైద్యం కోసం కర్షక మహర్షి ఆసుపత్రికి వచ్చే రోగులతోపాటు చుట్టుపక్కల గ్రామాల పేద ప్రజలకు ఉచితంగా అమృత ఆహారాన్ని అందిస్తున్నారు. అదే విధంగా అమృత ఆహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు.

వైద్యం అత్యంత ఖరీదైన ఈ రోజుల్లో.... నిత్యం వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ పోషకాలతో కూడిన అమృత ఆహారాన్ని ఉచితంగా అందించడం పట్ల రామ్మోహన్ రావును పలువురు అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి : Additional Vistadome Coach to Kirandul train: పర్యాటకుల రద్దీతో అరకు రైలుకు అదనపు బోగీ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.