విశాఖపట్నం ఎంవీపీ కాలనీకి చెందిన రవిరాజా తన తల్లి పోలమ్మ జ్ఞాపకాలను ప్రతిమ రూపంలో పదిలం చేసుకున్నారు. కొద్ది రోజుల కిందట ఆమె మరణించారు. అమ్మ తన పక్కనే ఉందన్న ధైర్యం కోసం పెద్ద ప్రతిమైతే బాగుంటుందని భావించారు. ఇందుకోసం విశాఖకు చెందిన శిల్ప కళాకారుడు వై.రవిచందర్‌ను సంప్రదించారు. ఆయన 2 నెలలు శ్రమించి.. అత్యంత సహజంగా, అచ్చం కళ్ల ముందే ఉందనేలా రూపొందించారు. అయిదున్నర అడుగుల ఎత్తులో సింహాసనంపై కూర్చొని నవ్వుతున్నట్లు కనిపించేలా తల్లి ప్రతిమను చేయించారు.
ఇదీ చదవండి: