ETV Bharat / city

ఏడాదిలోనే 95 శాతం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు: మంత్రి బొత్స

ఈ ఏడాది కాలంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారని మంత్రి బొత్ససత్యనారాయణ అన్నారు. ప్రజలకు మంచి చేయాలని తాము భావిస్తుంటే కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.

author img

By

Published : May 30, 2020, 2:17 PM IST

ycp leaders pay tribute to YS statue in one year complete ycp govt
వైఎస్ విగ్రహానికి వైకాపా నేతల నివాళి

ముఖ్యమంత్రి జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా... విజయవాడ కంట్రోల్‌ రూం వద్ద వైయస్‌ విగ్రహానికి పలువురు వైకాపా నేతలు పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌రావులతోపాటు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌ పాల్గొన్నారు.

సంక్షేమ పాలన

ఏడాది పాటు సంక్షేమ పాలన అందించిన ముఖ్యమంత్రి జగన్​కు మంత్రి బొత్స సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కాలంగా సీఎం జగన్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నూటికి తొంబై అయిదు శాతం అన్ని కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. ప్రజలకు మంచి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తుంటే.. కొందరు న్యాయస్థానాలకు వెళ్లి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.

ఇవీ చదవండి:

ఏడాది పాలనలో ఎవరికేం ఒరగబెట్టారని ఉత్సవాలు?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.