తెదేపా నేతల అరెస్టులను యనమల రామకృష్ణుడు ఖండించారు. తప్పుల మీద తప్పులు చేస్తోంది.. జగనేనని యనమల దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ ఒక తప్పు అయితే జెసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి అరెస్టులు మరో తప్పని మండిపడ్డారు. తప్పులను సరిదిద్దుకునే ధైర్యం జగన్‌కు లేదని యనమల విమర్శించారు. కోర్టుల తీర్పులను జగన్ సహించలేరన్నారు. రోజురోజుకూ కక్ష సాధింపు పెరిగిపోతోందని.. జగన్ పతనానికి బాటలు పడుతున్నాయన్నారు. ఇప్పటికే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు వైకాపా దూరం అయ్యిందన్న యనమల... బాధిత వర్గాల ప్రజలే వైకాపాకి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు