ETV Bharat / city

'స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేలా చూసే బాధ్యత గవర్నర్​దే' - పంచాయతీ ఎన్నికలు న్యూస్

పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ సరైన దిశానిర్ధేశం చేయాలని తెదేపా నేత యనమల వ్యాఖ్యనించారు. ప్రభుత్వానికి గ్రామ స్వరాజ్యంపై గౌరవం ఉంటే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మళ్లీ అప్పీల్​కు వెళ్లరన్నారు.

'స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేలా చూసే బాధ్యత గవర్నర్​దే'

author img

By

Published : Jan 21, 2021, 8:07 PM IST

ప్రభుత్వానికి గ్రామ స్వరాజ్యంపై గౌరవం ఉంటే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మళ్లీ అప్పీల్​కు వెళ్లరని తెదేపా నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యనించారు. ఎన్నికలు వెంటనే నిర్వహించటంతో పాటు ఇందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా చొరవ చూపాల్సిన బాధ్యత గవర్నర్​దే అని తేల్చిచెప్పారు.

పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ సరైన దిశానిర్ధేశం చేయాలన్నారు. గ్రామ స్వరాజ్యం అంటే వాలంటీర్ల రాజ్యం కాదని ఎద్దేవా చేశారు. ఎన్నికైన స్థానిక ప్రజా ప్రతినిధులే గ్రామ స్వరాజ్య రథ సారథులన్నారు. పంచాయతీ ఎన్నికలు జరపకపోవటం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలు అనేక పదవులు కోల్పోతారన్నారు. కేంద్రం నుంచి నిధులు లేక ఇప్పటికే గ్రామాల అభివృద్ది కుంటుపడిందని ఆక్షేపించారు. ప్రభుత్వం మొండితనానికి పోకుండా వెంటనే ఎన్నికలు నిర్వహించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టాలని హితవు పలికారు.

ఇదీచదవండి

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం: ఎస్‌ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.