ETV Bharat / city

ఎవరి కాళ్లు ఎవరు పట్టుకున్నారో అందరికీ తెలుసు: యనమల - yanamala rama krishnudu

తెదేపాది కాళ్లు పట్టుకునే స్వభావం కాదని... చిదంబరం కాళ్లు తాము పట్టుకున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని ట్విటర్​ వేదికగా మాజీ మంత్రి యనమల మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్​ పై విజయసాయి రెడ్డి కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

యనమల రామకృష్ణుడు
author img

By

Published : Aug 3, 2019, 7:11 PM IST

yanamala fires on vijayasai reddy
విజయసాయి రెడ్డిపై యనమల ట్వీట్​

అవాస్తవ అభియోగాలు మోపి చంద్రబాబును, లోకేశ్​ ను జైలుకు పంపాలన్న వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఆరాటం చూస్తే బాధేస్తోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. తండ్రీ కొడుకులు జైలుకు వెళ్తారని ఏ దురుద్దేశంతో అంటున్నారని ప్రశ్నించారు. ట్విటర్​ వేదికగా విజయసాయిరెడ్డిపై యనమల మండిపడ్డారు.

''చంద్రబాబు పై కేసులు పెట్టాలని భాజపా నేతలు కాళ్లు పట్టుకున్నారా... వారి కేసులు మాఫీ కోసం కాళ్లు పట్టుకున్నారా'' అని యనమల నిలదీశారు. చిదంబరం కాళ్లు తెదేపా నేతలు పట్టుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని... ఆ స్వభావం కానీ, అవసరం కానీ తెదేపాకి ఎన్నడూ లేదని స్పష్టం చేశారు. భాజపా నేతల కాళ్లు వైకాపా నేతలు పట్టుకోవడం అందరూ చూశారని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

రేషన్ కార్డులు తొలగిస్తున్నారు, అన్నా క్యాంటీన్లు నిలిపేశారు, గృహ నిర్మాణం బిల్లులు ఆపేశారని దుయ్యబట్టారు. ‘కియా’ వంటి పరిశ్రమల అధికారులను బెదిరించి ఉపాధిని దెబ్బతీస్తున్నారని, పెట్టుబడులు రాకుండా చేస్తున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

పోలవరం టెండర్లు ఎలా రద్దు చేస్తారు: దేవినేని

Intro:ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన మాక్ పోలింగ్. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం ఎన్ఆర్ కమ్మపల్లె పోలింగ్ కేంద్రం 321 లో రీపోలింగ్ సందర్భంగా మాక్ పోలింగ్ ను ఎన్నికల అధికారులు, పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య ప్రశాంతంగా నిర్వహించారు.

Body:చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం ఎన్ఆర్ కమ్మ పల్లెలో రీ పోలింగ్ సందర్భంగా గా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవడానికి వీలుగా వేర్వేరుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Conclusion:మాక్ పోలింగ్ అనంతరం ఓటుహక్కు వినియోగించుకోడానికి ముందుగా వృద్ధులు పోలింగ్ కేంద్రం వైపు ఉత్సాహంగా అడుగులు వేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.