ETV Bharat / city

ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ? - panel board latest news

తెలంగాణలోని శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదానికి కారణాలపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి 9.30 - 10.30 గంటల మధ్య షార్ట్‌ సర్క్యూట్‌ ప్యానల్‌ బోర్డుల బ్యాటరీ బ్యాకింగ్‌ మార్పు సమయంలో ప్రమాదం జరిగిందని ఓ అంచనాకు వచ్చారు. అసలా గంటలో ఏం జరిగిందో విశ్లేషిస్తున్నారు.

ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?
http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/22-August-2020/8511739_68_8511739_1598061550958.png
author img

By

Published : Aug 22, 2020, 9:49 AM IST

తెలంగాణలోని శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మంటలు రేగడానికి కారణాల్లో ప్యానల్‌ బోర్డుల బ్యాటరీ బ్యాకింగ్‌ మార్పు ప్రక్రియ ఒకటని ఇంజినీరింగ్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. గురువారం రాత్రి 9.30 నుంచి 10.30 గంటల మధ్య షార్ట్‌సర్క్యూట్‌ సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. కొంతకాలంగా ఈ విద్యుత్ కేంద్రంలోని బ్యాటరీల పనితీరు సరిగా లేకపోవడంతో ఇటీవలే వాటిని మార్చాలని అధికారులు నిర్ణయించారు. 15 రోజుల క్రితమే కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. మొత్తం 110 బ్యాటరీలను అమర్చాలని తీర్మానించారు.

ఒకే చోటి నుంచి పనిచేస్తోంది...

రెండో సెట్‌ బిగింపు సందర్భంగా... శ్రీశైలం విద్యుత్ కేంద్రం మొత్తం సెంట్రల్‌ కంట్రోలింగ్‌ విధానంతో ఒకే చోటి నుంచి పనిచేస్తోంది. విద్యుదుత్పత్తి కేంద్రంలోకి నీటి విడుదలకు గేట్ల ఆపరేటింగ్‌, జనరేటర్ల ఆన్‌ అండ్‌ ఆఫ్‌, సింక్రనైజింగ్‌, లోడింగ్‌, కంట్రోలింగ్‌ తదితరాలన్నీ సెంట్రల్‌ కంట్రోలింగ్‌ నుంచే చేస్తున్నారు.

అంతా ప్యానెల్ బోర్డుల ద్వారానే...

మొత్తం 900 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. ఆరు యూనిట్లలోని జనరేటర్ల నిర్వహణ అంతా ప్యానల్‌ బోర్డుల ద్వారానే చేస్తున్నారు. ఇవన్నీ కంప్యూటర్‌ ఆధారితంగా పనిచేస్తున్నాయి. ఈ ప్యానల్‌ బోర్డులకు విద్యుత్తు(డీసీ) సరఫరా చేయాల్సిన బ్యాటరీలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని గుర్తించారు.

భారీ ప్రమాదం...

వీటిని సరిచేసేందుకు 55 బ్యాటరీలతో కూడిన ఒక సెట్‌ను రెండు రోజుల క్రితం బిగించారు. రెండో సెట్‌ పని గురువారం రాత్రి 11 గంటలకల్లా పూర్తికావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆరో యూనిట్‌కు సంబంధించిన ప్యానెల్‌ బోర్డుల్లో రాత్రి 9.30 నుంచి 10.30 గంటల మధ్య మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాటరీల సంస్థకు చెందిన ఇద్దరు సిబ్బంది వినేశ్‌, మహేశ్‌ ప్రమాదంలో ప్రాణాలు వదిలారు. బ్యాటరీల మార్పిడిని పర్యవేక్షించేందుకు వారు అక్కడి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఇద్దరితో పాటు హైదరాబాద్‌ నుంచి జలవిద్యుత్ విభాగాని(హెచ్‌పీసీ)కి చెందిన ఏడుగురు ఇంజినీర్లు కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. వారు విధులు పూర్తి చేసుకుని భోజనానికి భూగర్భ కేంద్రం నుంచి పైకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఆయన పరిశీలించాకే...

గత నెల 24, 25 తేదీల్లో సీఎండీ ప్రభాకర్‌రావు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రెండు విద్యుదుత్పత్తి కేంద్రాలను పరిశీలించారు. నిర్వహణ పట్ల సిబ్బందిని హెచ్చరించి, సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. భూమట్టానికి 72 మీటర్ల లోతున బాహ్య ప్రపంచం నుంచి 1.2 కిలోమీటర్ల సొరంగ మార్గంలో శ్రీశైలం ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ఉంది.

అందుకే మార్గం కనిపించకుండా...

ఒక్క సొరంగం ద్వారా మాత్రమే ఇక్కడి చేరుకోవాలి. భూగర్భంలో ప్రమాద సంఘటన సందర్భంగా విద్యుత్ నిలిచిపోవడంతో సిబ్బందికి మార్గం కనిపించకుండా పోయి ఉంటుందని ప్రాణాలు వదిలిన వారి సహచరులు చెబుతున్నారు.

ఇవీ చూడండి : ఈసారి నిరాడంబరంగా గణేశ్​ ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.