ETV Bharat / city

valentine's day: మోస్ట్ ఎలిజిబుల్ లవర్ ఎవరో తెలుసా..? - ప్రేమికుల రోజు కథనాలు

Qualifications required FOR love : ప్రేమ... చదవడానికి రెండే అక్షరాలు కావొచ్చు.. చూడడానికి చిన్న పదమే కావొచ్చు.. కానీ సృష్టిని నడిపించేంత శక్తి ఉన్నది వాటికి. పంచభూతాలైన నింగి, నేల, నీరు, నిప్పు, గాలి... ఈ సృష్టిని ఎంత ప్రభావితం చేస్తాయో... అవే రెండక్షరాలైన ప్రేమ కూడా అంతే ప్రభావితం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. వాటికి ఏవిధంగా మరణం లేదో.. వాటిలాగే ప్రేమకూడా అమరం. ప్రేమ ఎంత విలువైనది.. దాని విలువ తెలుకున్న వారికి అదో అక్షయపాత్ర వంటిది. ప్రేమ "నీటిలా" స్వచ్ఛమైనది.. చూసే వారిని కనులకు రకరకాలుగా కనిపించినా.. అది ఎప్పటికీ నిర్మలమైనదే.

మోస్ట్ ఎలిజిబుల్ లవర్ ఎవరో తెలుసా
మోస్ట్ ఎలిజిబుల్ లవర్ ఎవరో తెలుసా
author img

By

Published : Feb 14, 2022, 5:32 AM IST

కొన్ని నిజాలు మాట్లాడుకుందాం..

Qualifications required FOR love : ఎవరైనా తమకు అనుకూలంగా ఉన్న మాటలను వినడానికి, చదవడానికే ఇష్టపడతారు. జరుగుతుంది, చేస్తుంది తప్పని తెలిసినా వాటిని ఒప్పుకోడానికి సుముఖత చూపరు. అందుకే మన దగ్గర సైంటిస్టుల కంటే.. దొంగ బాబాలు ఫేమస్​.. మనకు అనుకూలంగా లేదనిపిస్తే ఎంతో ఆతృతగా చదువుతున్న జాతకాల పేజీని కూడా తిప్పేస్తాం.. తర్వాత ఎలా అయిన పర్వాలేదు కానీ.. వినడానికి మంచిగా ఉన్న వాటినే ఆలకించేందుకు సిద్ధపడిన మనం.. నిజం గురించి తెలుకోడానికి ఆశక్తి చూపం. తీరా తెలుసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఒక్కోసారి ఆ నష్టం విలువ ఓ జీవితం, ప్రాణం కూడా అయ్యి ఉంటుంది.

మోస్ట్ ఎలిజిబుల్ లవర్ ఎవరో తెలుసా
మోస్ట్ ఎలిజిబుల్ లవర్ ఎవరో తెలుసా

రూపం లేని ప్రేమకు భావాల ముసుగులు తగిలించొద్దు..

ప్రేమను అందరూ ఓ అందమైన పుష్పంతోనో.. ప్రకృతితోనో పోల్చుతారు. వినేటప్పుడు, సినిమాల్లో చూసేటప్పుడు, పుస్తకాల్లో చదివేటప్పుడు చాలా అందంగానే కనిపిస్తుంది. కానీ నిజజీవితంలో అంతే అందంగా ఉంటుందా అని ప్రశ్న వేసుకుంటే దానిని ఫేస్​ చేసిన వారికే తెలుస్తుంది. ప్రేమలో గెలిచి, ఓడిన వారి అభిప్రాయాలను పరిశీలిస్తే.. ప్రేమ లోతెంతో తెలుస్తుంది. మన కంటికి కనిపిస్తున్నట్లు ప్రేమ అందమైన సీతాకోక చిలుక వంటిది కాదు.. ప్రేమ ఒక అందవికారమైన గొంగళిపురుగు వంటింది. ఎన్నో కష్టాలు పడి, మరెన్నో వ్యయప్రయాసలకోర్చి, త్యాగాలు, సర్దుకుపోవడాలు, తదితర దశలు అన్ని దాటుకున్న తర్వాతే గొంగళిపురుగు సీతాకోకచిలుక అయ్యినట్టు.. ప్రేమ కూడా వికసిస్తుంది. ప్రేమలో పడే సమయంలో ముందున్న దశలు కనిపించవు.. దానిలో దిగిన తర్వాతే ఒక్కో దశ ఎదురవుతూ.. ఎన్నో పరీక్షలు పెడుతుంది. అన్నింటినీ ఓర్పుగా, నేర్పుగా దాటిన వారికి.. కడలిని చిలికితే అమృతం లభించినట్లు ప్రేమ జీవిత మాధుర్యాన్ని అందిస్తుంది. లేకుంటే కాలకోట విషాదాన్ని మిగుల్చుతుంది.

ఇదీ చూడండి : Love Fraud: ప్రేమ పేరుతో నగ్న చిత్రాలు సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు

ప్రేమలో "ప్రే" అంటే ప్రేమించడం.. "మ" అంటే మర్చిపోవడమేనా..

పుట్టుక మొదలు కడవరకు మనిషి జీవితం గెలుపోటముల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. ఉదాహరణకు ఓ పరుగుపందెంలో గెలిచిన వారిని ఆ పోటీ గురించి అడిగితే గమ్యం గురించి చెబుతాడు.. అదే ఓడిన వారిని అడిగితే దూరం గురించి చెబుతాడు. అలాగే ప్రేమ చదరంగంలోను భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ప్రేమ ఫలించి ఒక్కటైన జంట ఆ ప్రేమ గురించి ఎంతో అద్భుతంగా చెబుతారు. అదే ప్రేమలో ఓడిన వారిని ప్రశ్నిస్తే మరో రకమైన జవాబు వినిపిస్తుంది. ప్రేమ ఎవ్వరికీ అనుకూలంగాను.. ఎవ్వరికీ ప్రతికూలంగానూ ఉండదు. అది వారివారి మనస్తత్వాల మీద, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అలాగని ఎవ్వరికీ సులభంగానూ దక్కదు. వాస్తవానికి ప్రేమ ఎవ్వరినీ ఓడిపోనివ్వదు.. అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతుందో ఏమోగాని.. ప్రేమ.. గెలిచే వరకూ మది తలుపులు తడుతూనే ఉంటుంది. ప్రేమ అంటే మరచి పోవడం కాదు.. ఎందుకంటే ప్రేమను ప్రేమించిన వారు ప్రేమను మరచిపోలేరు. ప్రేమించిన వారిని మరచి పోలేరు. అలా మరచిపోయారంటే అది ప్రేమ కాదనే చెప్పాలి.

ప్రేమికుల రోజు
ప్రేమికుల రోజు

ప్రేమ ఏమి కోరుకుంటుంది..

"ప్రేమ ఏమి కోరుకుంటుంది..?" ఈ ప్రశ్నకు భిన్న సమాధానాలు వస్తాయి. ప్రేమ తోడును కోరుతుంది అని కొందరు అంటుంటే... కాదు కాదు.. ప్రేమ బలికోరుతుంది అని మరికొందరు అంటుంటారు. ఇలా వినాలేగాలి మనిషికో అభిప్రాయం చెబుతారు. వాస్తవానికి ప్రేమ.. ప్రేమను కోరుకుంటుంది.. దానిని నిజాయతీగా ఉంటూ.. నమ్మకంతో గెలుచుకోమంటుంది. ఈ విషయాన్ని పలువురు అంగీకరించక వితండ వాదం చేసినప్పటికీ ఆత్మవిమర్శ చేసుకుంటే మనకే తెలుస్తుంది.. కల్మషమైన ఆలోచనతో కాకుండా నిర్మలమైన హృదయంతో ఆలోచిస్తే ప్రేమ మాధుర్యం తెలుస్తుంది.

ఇదీ చూడండి : వివాహితకు ప్రేమ లేఖ- హైకోర్టు సంచలన తీర్పు

ప్రేమ నుంచి ఏమి నేర్చుకోవాలి..

ప్రేమ ఒక కావ్యం కాదు.. దీనికి ఓ ప్రారంభం, ముగింపు ఉండదు. ఆది.. అంతం లేని సాగరం వంటిది ప్రేమ. కడలి గర్భంలో ఎన్నో వింతలు, విలువైన సంపద, ప్రమాదాలు, అవరోధాలు దాగి ఉన్నట్లే ప్రేమసాగరంలో కూడా కష్టాలు, ఇష్టాలు, అవమానాలు, అవరోధాలు, విఘ్నాలు, సంతోషాలు అన్ని మిళితమై ఉంటాయి. అందువల్లే సాగరాన్ని ఈదాల్సి వచ్చినప్పుడు ఎంత నేర్పుగా, ఓర్పుగా వ్యవహరిస్తామో.. ప్రేమ సాగరాన్ని దాటాలంటే అంతే ఓర్పు నేర్పు అవసరం. అంతే కానీ... ప్రతికూల పరిస్థితులకు తలొగ్గి నిండు జీవితాన్ని మధ్యలోనే ముగించేయడం వంటివి చేయకూడదు. నీ ఆలోచన మంచిదైతే.. నీ కార్యంలో తలంపు శ్రేష్ఠమైనదైతే.. ఈ ప్రకృతి కూడా సహకరించి తలపెట్టిన పనిని సఫలీకృతం చేసినట్లు.. నీ మనసులో మలినమైన ఆలోచన లేనప్పుడు, ఓర్పు నేర్పుగా వ్యవహరిస్తే ప్రేమ నీ వశం అవుతుంది. అందుకు నీ చుట్టు ఉన్న పంచభూతాలు సహకరిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే అంటారు ప్రేమను ప్రేమతో ప్రేమిస్తే.. ప్రేమించబడిన ప్రేమ ప్రేమించిన ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది అంటారు. ఈ అన్ని విషయాలను తెలుసుకున్న వారే మోస్ట్​ ఎలిజిబుల్​ లవర్​ అనడంలో సందేహం లేదు.

-- ఈటీవీ భారత్​ ప్రత్యేకం..

ఇదీ చూడండి : pslv C-52:నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సి52...కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.