ETV Bharat / city

'హోటల్ నిర్వహణతో మాకు సంబంధం లేదు' - విజయవాడలో అగ్నిప్రమాదం వార్తలు

స్వర్ణప్యాలెస్​ హోటల్​ నిర్వహణతో తమకు సంబంధం లేదని రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం వెల్లడించింది. ప్రభుత్వ అనుమతితోనే అక్కడ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.

swarna palace hotel
swarna palace hotel
author img

By

Published : Aug 10, 2020, 5:53 AM IST

ఎక్కువ మంది కరోనా రోగులకు వైద్యం అందించాలన్న ఉద్దేశంతో, ప్రభుత్వ అనుమతితోనే స్వర్ణ ప్యాలెస్​ హోటల్​ను కొవిడ్ చికిత్సా కేంద్రంగా మార్చామని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. హోటల్​ నిర్వహణతో సంబంధం లేకుండా రోగులకు వైద్య సేవలు అందించే బాధ్యతనే రమేష్ ఆస్పత్రి నిర్వహించినట్లు తెలిపింది. ప్రమాద నేపథ్యంలో ఆదివారం ఆసుపత్రి యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది.

రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బందరు రోడ్డులోని రమేష్ ఆసుపత్రిని పూర్తిగా కరోనా రోగుల కోసం కేటాయించాం. దానిలో 30 పడకలే ఉండటంతో ఎక్కువ మంది రోగులను చేర్చుకోలేకపోతున్నాం. కరోనా రోగులను చేర్చుకోవాలని పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు రావటంతో అన్ని సౌకర్యాలు హోటల్​లో ప్రభుత్వ అనుమతితోనే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నాం. స్వర్ణప్యాలెస్​లో చక్కగా కోలుకుంటున్న కరోనా బాధితులు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటం దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం- రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.