ETV Bharat / city

నా చెరుకు మిషన్‌ ఏమైంది.. విజయవాడ సీపీకి ఓ సామాన్యుడి ఫిర్యాదు - ద్వారకా తిరుమల రావు

ఒకరు ఆస్తి కోసం వేధిస్తున్నారని.. నాలుగేళ్లు కిందట చెరుకు మిషన్‌ను తీసుకెళ్లి పోలీసులు ఇంతవరకు ఇవ్వలేదని ఇంకొకరు. ఇలా వందల ఫిర్యాదులు విజయవాడ సీపీకి చేరాయి. స్పందన కార్యక్రమంలో భాగంగా నేరుగా బాధితులతో మాట్లాడిన ద్వారకా తిరుమలరావు... సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

స్పందన కార్యక్రమంలో భాగంగా విజయవాడ సీపీకి ఓ సామాన్యుడి ఫిర్యాదు
author img

By

Published : Jul 3, 2019, 7:32 AM IST

స్పందన కార్యక్రమంలో భాగంగా విజయవాడ సీపీకి ఓ సామాన్యుడి ఫిర్యాదు

రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబం... లక్ష్మీనారాయణ అనే వ్యక్తి రోడ్డు పక్కన చెరుకు రసం విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగేళ్ల కిందట వన్ టౌన్ పోలీసులు చెరుకు రసం మిషన్ తీసుకెళ్లారు. ఇంత వరకు ఇవ్వలేదు .. పోలీసు స్టేషన్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. ఏళ్లు గడిచినా ఫలితం లేదు. ఇప్పుడా మిషన్ ఎక్కడుందో సమాధానం చెప్పే వారే లేరని సీపీకి ఫిర్యాదు చేశాడు.

పోలీసు శాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసిన ఓ వ్యక్తి హఠాత్తుగా మరణించాడు. మరణానంతరం కుటుంబానికి రావాల్సిన డబ్బుల కోసం భార్య వెళ్లింది. కానిస్టేబుల్‌ పొందుపరిచిన వివరాల్లో తన పేరు లేదని అధికారులు వెనక్కి పంపారంటూ ఓ మహిళ సీపి దగ్గర బోరుమంది. తన భర్త పేరు మార్చుకుని సూర్యారావుపేటలో మరో మహిళతో కాపురం చేస్తున్నాడని తనకు న్యాయం చేయాలని సత్యనారాయణపురానికి చెందిన మహిళ ఫిర్యాదు చేసింది.
అన్నింటినీ విన్న కమిషనర్ ద్వారకా తిరుమలరావు... స్థానిక పోలీసులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించటమే కాదు... పనితీరునూ పరిశీలిస్తామని సీపి తెలిపారు. కొద్ది రోజుల తర్వాత కేసుల వివరాలు ఫిర్యాదుదారులకు తెలియచేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి:

కళాశాల ఔదార్యం.. విద్యార్థుల కోసం బుక్​ బ్యాంక్​

Intro:ap_knl_21_02_last_concil_av_AP10058
యాంకర్, పురపాలక సంఘము కౌన్సిలర్ల పదవీ కాలం ముగిసిన క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాలలో హడావుడిగా అభివృద్ధి పనులు ప్రారంభించారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి తో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ సులోచన రూ.22 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అమృత్ పథకం కింద మంజూరైన నీటి ట్యాంకులు, పురపాలక సంఘం నిధులతో పట్టణంలో ని పలు వార్డుల్లో నిర్మించిన సీసీ. రహదారులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Body:రోడ్ల ప్రారంభం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.