Mayor Letter: విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని సినిమా థియేటర్లకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి లేఖ రాశారు. సినిమా విడుదల సందర్భంగా మెుదటి రోజు ప్రతి షోకు మల్టీప్లెక్స్ థియేటర్లలో 100 టికెట్లు పంపాలని లేఖలో పేర్కొన్నారు.
పార్టీ కార్పొరేటర్లు, నాయకులు సినిమా టికెట్లు అడుగుతున్నారని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. సినిమా టికెట్లను ఛాంబర్‌కు పంపాలని, అందుకు అయ్యే డబ్బులు చెల్లిస్తామని లేఖలో రాసుకొచ్చారు. నగరంలోని అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లకూ ఈ లేఖలు పంపారు. నేరుగా నగర మేయర్ నుంచి టికెట్ల కోసం లేఖ రావటంతో.. విస్తుపోవడం థియేటర్ యజమానుల వంతైంది.
ఇదీ చదవండి:
అలా చేసినా.. ఆ పార్టీకి ఓట్లు పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది: శైలజానాథ్