విజయవాడ కనక దుర్గమ్మ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి రూ.2.87 కోట్ల నగదు, 546 గ్రాముల బంగారం, 9.55 కిలోల వెండి హుండీల్లో కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దుర్గగుడి ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. రేపు కూడా హుండీల లెక్కింపు కొనసాగనున్నట్లు దుర్గ గుడి అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
CM Jagan Review: ఉద్యోగ కల్పన దిశగా విద్యాప్రమాణాలు మెరుగుపరచాలి: సీఎం జగన్