విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు నగరంలో ఆకస్మిక పర్యటన చేశారు. పటమట, పెనమలూరు, మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బెంజ్ సర్కిల్, సనత్ నగర్, మహానాడు జంక్షన్, మధుచౌక్ సెంటర్ ప్రాంతాలను తనిఖీ చేశారు. అర్ధరాత్రి రాకపోకలు సాగిస్తున్న వాహనాలు, వాటి అనుమతులపై ఆరా తీశారు. కృష్ణా జిల్లా రెడ్‌జోన్ పరిధిలో ఉన్నందున కేసుల సంఖ్య బాగా తగ్గే వరకు లాక్డౌన్ నింబంధనలు కఠినంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
ఇదీ చూడండి..