ETV Bharat / city

40 రోజులు.. రూ.40 లక్షల అద్దె! - హైదరాబాద్​ తాజా వార్తలు

నెల కాగానే ఇంటి అద్దె చెల్లించాలంటే డబ్బు లేక ఇబ్బంది బడుతుంటాం. రెండు రోజులు ఆగండి అని యజమానులను అభ్యర్థిస్తుంటాం. కానీ ఓ వ్యక్తి రోజుకు లక్ష అద్దె చెల్లిస్తూ.. ఏకంగా 40 రోజులు గడిపి 40 లక్షలు చెల్లించాడు. ఇదేదో కష్టపడి సంపదంచి సొమ్ముతో కాదు.. మోసం చేసిన సంపదించిన డబ్బుతో.

vijay reddy paid heavily rented to hotel with cheated money
40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
author img

By

Published : Feb 26, 2021, 9:10 AM IST

అదో విలాసవంతమైన హోటల్‌.. సంపన్నులు బస చేసే ప్రత్యేక గది. రోజుకు అద్దె రూ.50 వేలు.. ఇతరత్రా ఖర్చులు మరో రూ.50 వేలు.. అంటే రోజుకు రూ.లక్ష.. అలాంటి చోట నలబై రోజులుండి రూ.40 లక్షలు చెల్లించారు. వాళ్లెవరో కోటీశ్వరులు కాదు.. వ్యాపారవేత్తలూ కాదు. ఐపీఎస్‌ అధికారిగా ప్రియుడు.. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్‌గా ప్రియురాలు పరిచయం చేసుకొని బాచుపల్లి ఠాణా పరిధిలో ఓ వ్యాపారికి రూ.11.5 కోట్లు టోకరా వేసిన కేటుగాళ్లు. ఈ కేసులో విస్తుపోయే అంశాలు ఎన్నో దర్యాప్తులో వెలుగు చూడటంతో ఔరా అంటూ సైబరాబాద్‌ పోలీసులు ముక్కున వేలేసుకున్నారు.

లైవ్‌ లొకేషన్‌ పంపించమంటే ఆత్మహత్య...

కడపకు చెందిన శిరీష అలియాస్‌ స్మృతి సింహ, విజయ్‌కుమార్‌రెడ్డి మాయమాటలతో వ్యాపారి వీరారెడ్డి నుంచి రూ.11.5 కోట్లు వసూలు చేశారు. రోజులు గడుస్తున్నా డబ్బు చెల్లించకపోవడంతో వీరారెడ్డికి అనుమానమొచ్చి విజయ్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ఎక్కడున్నావని అడిగితే డెహ్రాడూన్‌లోని పోలీసు అకాడమీలో ఉన్నానని చెప్పాడు. అయితే.. వాట్సప్‌లో లైవ్‌ లొకేషన్‌ పంపించాలంటూ వీరారెడ్డి సూచించారు. దీంతో మిమ్మల్ని నేను మోసం చేశాను. శిరీష నన్ను తప్పుదోవ పట్టించింది.. ఐయామ్‌ సారీ అంటూ వాయిస్‌ రికార్డును వీరారెడ్డికి పంపించి ఈ నెల 5న ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ నెల 12న వీరారెడ్డి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. కి‘లేడీ’ సహా ఆమెకు సహకరించిన విజయ్‌కుమార్‌ రెడ్డి బంధువులు నలుగుర్ని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కార్లంటే మహా ఇష్టం.. అందుకే..

వీరారెడ్డి నుంచి వసూలు చేసిన డబ్బులో ఎక్కువ శాతం విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు వెచ్చించినట్లు తెలుసుకొని పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. విజయ్‌కుమార్‌ రెడ్డికి కార్లంటే మహా ఇష్టం. రూ.1.8 కోట్లతో బీఎండబ్ల్యూ కారును మొదట కొన్నాడు. ఆ ఫొటోలను వీరారెడ్డికి పంపించాడు. దీంతో ఆయన వీళ్లను పూర్తిగా నమ్మేశారు. ఆ తర్వాత రూ.1.7 కోట్లతో మరో కారు, రూ.70 లక్షలతో ఇంకో కారు కొన్నాడు. ప్రేయసికి పుట్టిన రోజు కానుకగా రూ.50 లక్షల బంగారు ఆభరణాలను బహూకరించాడు. శంషాబాద్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో రూ.40 లక్షలు వెచ్చించి 40 రోజులు బస చేశారు. వైజాగ్‌లోనూ ఎనిమిది రోజులు ఉన్నారు. రూ.1.5 కోట్లతో పటాన్‌చెరులో విల్లాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని రూ.70 లక్షలు చెల్లించారు.

బంధువులకు అప్పులు...

బంధువుల్లో ఎవరికైనా అవసరమొస్తే సాయం చేసేవారు. ఎంత డబ్బు కావాలంటే అంత చేబదులు ఇచ్చేవారు. చిన్న చిన్న మొత్తాలైతే తిరిగి అడిగేవారు కాదు. ఈ తరహాలోనే ఒకరికి రూ.40 లక్షలు ఇవ్వగా.. ఆయన పొలం కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఇద్దరిపై బంధువుల్లో గౌరవం పెరిగింది. ఇంత తక్కువ కాలంలో ఇంత డబ్బు ఎలా సంపాదించారంటూ విజయ్‌కుమార్‌ రెడ్డిని తండ్రి రాఘవరెడ్డి (సీఐఎస్‌ఎఫ్‌లో ఏఎస్‌ఐ), ఇతర బంధువులు ప్రశ్నించారు. జరిగిన విషయమంతా చెప్పడంతో వాళ్లు కూడా జత కలిశారు. సీఐఎస్‌ఎఫ్‌లో డీసీపీ ర్యాంకు అధికారిగా పనిచేస్తున్నాడంటూ రాఘవరెడ్డిని వీరారెడ్డికి పరిచయం చేశారు. రకరకాల టెండర్లు ఇప్పిస్తామని, వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా చూస్తానంటూ అతను, ఇతర బంధువులు కూడా డబ్బు తీసుకొన్నారు.

అమ్మకు ఆరోగ్యం బాగా లేదంటూ...

వీరారెడ్డిని ప్రధాన నిందితుడు విజయ్‌కుమార్‌ చాలా తెలివిగా ముగ్గులోకి దింపాడు. తొలుత ‘‘మా అమ్మకు బాగాలేదు.. వైద్యం చేయించాలి.. అవసరానికి నా బ్యాంకు ఖాతా ఫ్రీజ్‌ అయింది.. కార్డులు కూడా పనిచేయడం లేదంటూ బురిడీ కొట్టించి తొలుత రూ.3.5 లక్షలు తీసుకొన్నాడు. ఆ తర్వాత తనకున్న 72 ట్రావెల్స్‌ బస్సుల ధ్రువీకరణ పత్రాలను రెన్యూవల్‌ చేయించాలంటూ మరో రూ.10 లక్షలు తీసుకున్నాడు. స్మృతి సింహ అలియాస్‌ శిరీష మానవ హక్కులకు సంబంధించిన సెమినార్లు, ఇతరత్రా సమావేశాలు నిర్వహించేందుకు డబ్బు కావాలని అడిగింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత బిల్లులు డ్రా చేసి ఇస్తానంటూ బురిడీ కొట్టించింది.

ఇదీ చదవండి: ఆన్​లైన్​ పరీక్షలో అక్రమాలు.. స్క్రీన్​షాట్లతో జవాబులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.