రాష్ట్రంలోని వరద పరిస్థితిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (VICE PRESIDENT CALL TO PM MODI, AMIT SHAH) మాట్లాడారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య.. ఉదయం ఫోన్ ద్వారా వరద పరిస్థితిని వారికి వివరించారు.
ఏపీలో వరద ప్రభావం తీవ్రంగా ఉందని.. ప్రజల ప్రయోజనాలు, భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరారు. అనంతరం(VENKAIAH NAIDU ON FLOODS IN AP) కేంద్ర హోంమంత్రితోనూ ఫోన్లో మాట్లాడిన ఉపరాష్ట్రపతి.. వరద ప్రభావం గురించి పూర్తిగా వివరించారు. వరద సహాయక చర్యలును ముమ్మరం చేయాలని అమిత్ షాను కోరారు.
వెంకయ్య సూచనలకు సానుకూలంగా స్పందించిన మోదీ, అమిత్‌షా.. కేంద్రం నుంచి ఇప్పటికే సాయం చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులోనూ అవసరమైన సహకారాన్ని అందజేస్తామని ఉపరాష్ట్రపతికి తెలిపారు.
ఇదీ చదవండి:
Peddireddy on 3 capitals repeal bill: చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి