తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక రోజు దొంగఓట్లు వెయ్యడానికి వచ్చిన 250 బస్సులు, జనాన్ని వెనక్కి పంపామని చెప్పిన డీజీపీ వారిపై చర్యలు తీసుకోకపోవటం బాధ్యతారాహిత్యమేనని తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. ఆ బస్సులెవరివి ? జనం ఎవరు ? ఎవరు పంపితే వచ్చారు ? నకిలీ ఓటర్ కార్డులెవరిచ్చారు ? ఎవరు తయారు చేసారు ? ఎందుకు దర్యాప్తు చేయలేదని నిలదీశారు. ఇదంతా ఎవరి కోసమని ప్రశ్నించారు.
పోలవరం ద్వారా దోపిడీకి కుట్ర
పోలవరం ద్వారా రూ.2,100 కోట్ల దోపిడీకి సీఎం జగన్ కుట్ర పన్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. అధికారం చేపట్టిన నాటి నుంచి జగన్ పోలవరాన్ని ఓ కల్పవృక్షంలా మార్చుకుని నిర్మాణాన్ని గాలికొదిలేశారని దుయ్యబట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును తిరిగి మెగా సంస్థకే అప్పగించి ఇసుక ధరల పేరుతో మూడు నెలల్లోనే 500 కోట్లు దోచిపెట్టారని విమర్శించారు. ఇప్పుడు మరో రూ.1,600 కోట్ల దోపిడీకి సిద్ధపడ్డారని ఆక్షేపించారు. కాంట్రాక్టర్లు, కమీషన్లపై చూపుతున్న శ్రద్ధ రైతు ప్రయోజనాలపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి