Varla Ramaiah letter to CM Jagan: రేపల్లె గ్యాంగ్ రేప్ బాధితురాలికి తక్షణమే రూ.కోటి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్‌కు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఏ రూపంలో, ఎక్కడ ఇచ్చారో స్పష్టత లేదని విమర్శించారు. రైల్వే స్టేషన్లో సామూహిక అత్యాచారం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడాన్ని చూస్తే.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్ధమవుతుందని మండిపడ్డారు.
తల్లిదండ్రుల పెంపకం సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని హోంమంత్రి తానేటి వనిత మాట్లాడటం బాధ్యతారాహిత్యమేనని ధ్వజమెత్తారు. బాధిత మహిళ కుటుంబం వారి స్వస్థలానికి వెళ్లి పనులు చేసుకునే పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వం బాధితురాలికి తక్షణమే రూ.కోటి ఆర్థిక సాయం, 5 ఎకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం, సొంత ఇల్లు ఇచ్చి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘోరాలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు.
ఇదీ చదవండి: