ETV Bharat / city

వైకాపా నేతలు కాలకేయులు.. మహిళలను కాపాడాలని సీఎం జగన్​కు అనిత లేఖ - ఏపీ లేటెస్ట్​ అప్​డేట్స్​

Anitha letter to CM: వైకాపా నేతలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం వీఓఏ నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి 'జే ట్యాక్స్' వసూళ్లు పక్కనపెట్టి.. మహిళా భద్రతపై దృష్టి పెట్టాలని అనిత హితవు పలికారు.

Anitha letter to CM
వంగలపూడి అనిత లేఖ
author img

By

Published : Mar 19, 2022, 12:25 PM IST

Anitha letter to CM: వైకాపా నేతలు... కాలకేయుల్లా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులపై సీఎం జగన్​కు అనిత బహిరంగలేఖ రాశారు. మచిలీపట్నం వీఓఏ నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యేనన్నారు. వైకాపా నేత గరికపాటి నరసింహారావు వేధింపులపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఈ మూడేళ్లలో మహిళలపై 1500కు పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగితే.. ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. "దిశ" కింద ఒక్క నేరస్థుడికైనా శిక్ష విధించారా? అని ప్రశ్నించారు.

Anitha letter to CM: రాష్ట్రంలో 'యథా లీడర్-తథా కేడర్' అన్నట్లుగా పరిస్థితి తయారైందని అనిత విమర్శించారు. ప్రభుత్వ చర్యలు నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నాయని అన్నారు. ఆడబిడ్డలపై వరుస అఘాయిత్యాలకు.. ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమని ఆరోపించారు. దేశంలో మహిళలపై జరిగే నేరాల్లో మూడోవంతు ఏపీలోనే జరగడం సీఎం అసమర్థతకు నిదర్శనంగా పేర్కొన్నారు.

ఆడబిడ్డలు అన్యాయమైపోతుంటే... వైకాపా మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి 'జే ట్యాక్స్' వసూళ్లు పక్కనపెట్టి.. మహిళా భద్రతపై దృష్టి పెట్టాలని అనిత హితవు పలికారు.

ఇదీ చదవండి: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి చంద్రబాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.