ETV Bharat / city

కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించింది అందుకే : సోము వీర్రాజు

Somu veerraju: ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఎక్సైజ్ సుంకాలు భారీగా తగ్గించిందని.. రాష్ట్ర భాజపా అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. 9 కోట్ల మంది పేదలకు లబ్ధి కలిగేలా వంట గ్యాస్ మీద రూ.200 రాయితీ ప్రకటించడం ద్వారా లక్షన్నర కోట్ల భారాన్ని కేంద్రం తగ్గించిందని పేర్కొన్నారు.

union government decreased excise tariffs says bjp leader somu veerraju
సోము వీర్రాజు
author img

By

Published : May 22, 2022, 6:54 AM IST

Somu veerraju: ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం.. ఎక్సైజ్ సుంకాలు భారీగా తగ్గించిందని.. రాష్ట్ర భాజపా అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్‌ సుంకం తగ్గించటం వల్ల లీటర్‌ పెట్రోల్‌పై రూ.9, డీజిల్‌పై రూ.7 వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. 9 కోట్ల మంది పేదలకు లబ్ధి కలిగేలా వంట గ్యాస్ మీద రూ.200 రాయితీ ప్రకటించడం ద్వారా లక్షన్నర కోట్ల భారాన్ని కేంద్రం తగ్గించిందని ఆయన పేర్కొన్నారు.

గతంలో కేంద్రం, ఇతర రాష్ట్రాలు ఎక్సైజ్‌ సుంకాలు తగ్గించినపుడు కూడా వైకాపా ప్రభుత్వం.. పన్నులు తగ్గించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పెట్రోల్‌, డీజిల్‌ కోసం సరిహద్దు ప్రాంతాల వారు కర్ణాటకకు వెళ్లుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర ప్రజలు‌ వైకాపా ప్రభుత్వాన్ని క్షమించరని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.