Ukraine students to meet CM Jagan: యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి తిరిగి చేరుకున్న విద్యార్థులు.. ఇవాళ సీఎం జగన్‌ను కలవనున్నారు. సచివాలయంలో మద్యాహ్నం 3 గంటలకు భేటీ అవ్వనున్నట్లు.. ఏపీలో ఉక్రెయిన్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న విద్యార్థులను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌కు లేఖ రాయడంతోపాటు, సచివాలయంలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఇప్పటి వరకు 918 మంది విద్యార్థులు, ఇతరులు రాష్ట్రానికి రాగా, వారిలో 692 మందిని ప్రభుత్వ సహాయంతో స్వస్థలాలకు పంపినట్లు వివరించారు.
ఇదీ చదవండి:
అప్పట్లో 20 కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చాం: రజత్ భార్గవ