విజయవాడ సింగ్ నగర్ లో నివాసముండే హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. సెవెన్ సిస్టర్స్ గా పిలవబడే బెజవాడ లక్ష్మి, ఆమె అనుచరుల వద్ద తాము రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నామని తెలిపారు. తమ నుంచి నూటికి 15 రూపాయలు వడ్డీ వసూలు చేశారని ఆరోపించారు.
కరోనా కారణంగా.. తాము 2 నెలలుగా వడ్డీ చెల్లించలేకపోయామని.. అప్పటి నుంచి ఆ మహిళా వ్యాపారులు తమను మానసికంగా వేధిస్తున్నారని.. ఆవేదన చెందారు. డబ్బులు చెల్లించకుంటే చంపేస్తామంటూ ఫోన్ కాల్స్‌లో బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: