- కాస్త ఉపశమనం
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 13,756 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 1,73,622 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో పశ్చిమగోదావరి జిల్లాలో 20 మంది మృతి చెందారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రహస్య ప్రాంతానికి ఆనందయ్య
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి రహస్య ప్రాంతానికి ఆనందయ్య తరలించారు. తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బందోబస్తుతో తీసుకెళ్లారు. ఆనందయ్య మందు కోసం.. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు కృష్ణపట్నం వస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- తితిదే ప్రకటన ఖండన
ఆంజనేయుడి జన్మస్థలంపై నెలకొన్న వివాదం.. ఇప్పట్లో సమసిపోయేలా లేదు. తిరుగిరుల్లోని అంజనాద్రే హనుమద్ జన్మస్థలమని తితిదే చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తున్న హనుమద్ జన్మభూమి తీర్థట్రస్ట్.. గురువారం నాటి సంవాదం తర్వాత.. తమవాదనే నెగ్గిందని తితిదే పండిత పరిషత్ చేసిన ప్రకటనను ఖండించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వాన కబురు
మే 31 నాటికి కేరళలో రుతుపవనాలు రాకకు అనుకూల వాతావరణం ఏర్పడినట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అనాథ చిన్నారులకు అండ
ఎన్డీఏ కూటమి రెండోసారి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న క్రమంలో కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల సంక్షేమం కోసం కీలక ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 18 ఏళ్లు దాటిన తర్వాత రూ.10 లక్షల సాయంతో పాటు పైచదువులకు హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మోదీ కాళ్లు పట్టుకునేందుకూ సిద్ధమే!'
ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన తుపాను సమీక్ష సమావేశంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఆయన్ను అరగంట పాటు వేచి ఉండేలా చేయడంపై వివరణ ఇచ్చారు. బంగాల్ సంక్షేమం కోసం మోదీ కాళ్లు పట్టుకునేందుకూ తాను సిద్ధమని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వ్యాన్‌పై బాంబు దాడి
అఫ్గాన్‌లో మినీ వ్యాన్‌పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు లెక్చరర్లు మృతిచెందారు. 11 మంది విద్యార్ధులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఉత్తర కపీసా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- జీఎస్టీ మినహాయింపునకు కేంద్ర బృందం ఏర్పాటు!
కొవిడ్ టీకాలు, ఔషధాలు వంటి వాటిపై జీఎస్టీ మినహాయింపు లేదా తగ్గింపుపై సమీక్షించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. జీఎస్టీ మినహాయింపుపై 8 మంది మత్రులతో కూడిన ఈ బృందం అధ్యయనం చేసి నివేదిక సమర్పించనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- యూఏఈ వేదికగా ఐపీఎల్ రెండో దశ
యూఏఈ వేదికగా ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది బీసీసీఐ. అయితే షెడ్యూల్‌ను ఇంకా ఖరారు చేయలేదని.. త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ నిర్వహణపై జులై చివర్లో లేదా జూన్ తొలి వారంలో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఇన్‌స్టాలో దూకుడు
సినిమాలతో బిజీగా ఉన్న కత్రినా కైఫ్.. ఇన్‌స్టాలో మరో మైలురాయిని చేరుకుంది. 50 మిలియన్ల ఫాలోవర్ల సొంతం చేసుకున్న బాలీవుడ్ ఐదో హీరోయిన్గా నిలిచింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.