- కరోనా కలవరం
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. తాజాగా 18వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,120 శాంపిల్స్‌ను పరీక్షించగా, 18,285 మంది కరోనా బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. అదే సమయంలో 24,105 కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,24,859కి చేరింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పథకాల ప్రకటన
వచ్చే నెలలో అమలు కానున్న పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. వచ్చే నెల 8న జగనన్న తోడు, 15న వైఎస్ వాహనమిత్ర, 22న వైఎస్ఆర్ చేయూత పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రేపు, ఎల్లుండి మహానాడు
రేపు, ఎల్లుండి జరగబోయే డిజిటల్ మహానాడును విజయవంతం చేయాలని... చంద్రబాబు తెదేపా శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు నేతలు, కార్యకర్తలకు డిజిటల్ ఆహ్వానం పంపారు. కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం, రెండేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు, స్కాములు తదితర అంశాలపై తీర్మానం చేయనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎన్టీఆర్ ట్రస్టు నిర్ణయం
రాష్ట్రంలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎన్టీఆర్ ట్రస్టు నిర్ణయించింది. రేపల్లె, పాలకొల్లు, కుప్పం, టెక్కలిలో ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ సీఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్టీఆర్ ట్రస్టు తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'యాస్' బీభత్సం
ఒడిశా, బంగాల్‌పై యాస్ తుపాను పంజా విసిరింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒడిశాలోని బాలేశ్వర్‌కు సమీపంలో తీరం దాటిన తుపాను బీభత్సం సృష్టించింది. ఒడిశాలో ముగ్గురు, బంగాల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. భీకర గాలులు, జోరు వానలకు ఊళ్లు, ఏర్లు ఏకమయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కేంద్రానికి సవాల్!
యోగా గురువు బాబా రాందేవ్ మరో వివాదానికి తెరతీశారు. ప్రభుత్వానికి దమ్ముంటే తనను అరెస్టు చేయాలని ఆయన సవాల్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మరోసారి దర్యాప్తు!
కొవిడ్-19 ఆవిర్భావంపై దర్యాప్తు చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ బృందం చైనాలో మరోసారి పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ల్యాబ్ లీకేజీ సహా పలు కోణాల్లో దర్యాప్తు చేయాలని భావిస్తున్నట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. పర్యటన తేదీ ఖరారు కాకపోయినప్పటికీ త్వరలోనే వుహాన్‌కు డబ్ల్యూహెచ్ఓ బృందం వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రత్యేక కొవిడ్ బీమా!
కరోనా సృష్టిస్తున్న విలయతాండవం వల్ల ఎప్పుడు.. ఎవరికి ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులకు ఆర్థిక భరోసానిచ్చేందుకు ఎల్&టీ బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'సీనియర్ల సలహాలతోనే సక్సెస్'
సీనియర్ల సలహాలతో ఇంగ్లాండ్ పర్యటనలో విజయవంతం కావాలనుకుంటున్నట్లు వెల్లడించాడు న్యూజిలాండ్ యువ ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్. పిచ్, వాతావరణ పరిస్థితులు, డ్యూక్స్ బంతులతో బౌలింగ్ వంటి విషయాలలో తనకు సహచరుల అనుభవాలు తోడ్పడతాయని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఇకపై ఎమ్జీఎమ్ స్టూడియో అమెజాన్ సొంతం
ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియో ఎమ్జీఎమ్ను 8.45 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసేందుకు అమెజాన్ అంగీకరించింది. ఈ ఒప్పందంతో ఆ స్టూడియోకు సంబంధించిన 4 వేల చిత్రాలతో పాటు 17 వేల టీవీ షోలు ప్రసారం చేసే అవకాశం అమెజాన్‌కు లభించనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.