- నీటి విడుదల ఆపండి..
ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ఆపాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విజయవాడ, తిరుపతికి 3 స్టార్
స్వచ్ఛత, పరిశుభ్రత నెలకొల్పడంలో అత్యున్నత ప్రమాణాలు పాటించే నగరాలకు ఇచ్చే రేటింగ్ వివరాలను వెల్లడించారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ. ముంబయి, మైసూర్, ఇండోర్ సహా మొత్తం ఆరు నగరాలను '5 స్టార్ గార్బేజ్ ఫ్రీ' నగరాలుగా ప్రకటించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మూడు రోజుల్లో రయ్..రయ్
రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రజారవాణా ప్రారంభమవుతుందని సీఎం జగన్ అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని.. భౌతికదూరం పాటించేలా చూడాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సొంతగూటికి 20 లక్షల మంది
మే 1 నుంచి ఇప్పటివరకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో 20 లక్షల మంది వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చామని భారతీయ రైల్వే ప్రకటించింది. ఇకపై మరిన్ని రైళ్లను కూడా నడుపుతామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'వలస' కష్టాలపై చర్చకు కాంగ్రెస్ పిలుపు!
లాక్డౌన్ నేపథ్యంలో కార్మికుల కష్టాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ.. భావసారూప్య పార్టీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేయనుంది. వలస కూలీలు, కార్మిక చట్టాల సవరణలపై చర్చించేందుకు ఈ భేటీని నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విజయం ఎలా?
కశ్మీర్... సువిశాల భారతావనికి మకుటం. అందాల లోయలు, హిమపాతాల సోయగాల సమాహారం. అయితే ఇందతా ఒకవైపే. నాణానికి మరోవైపు చూస్తే.. ఎన్నో ఏళ్లుగా కశ్మీర్లో తుపాకీ తూటా వినిపించని రోజు లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అప్పుడే అడ్వాన్స్...
'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్తో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతోందట. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రశాంత్కు మైత్రీ సంస్థ అడ్వాన్స్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అలా చెప్పాడు
వీరేంద్ర సెహ్వాగ్ అత్యధిక పరుగుల రికార్డు అధిగమించాలని యువరాజ్ తనకు సూచించినట్లు రోహిత్ శర్మ తెలిపాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో 209 పరుగులతో వెనుదిరిగిన సమయంలో యువీ ఆ మాట తనతో అన్నాడని తాజాగా గుర్తు చేసుకున్నాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రచారం ఎక్కువ- విషయం తక్కువ
ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఫిచ్ సొల్యూషన్స్... మోదీ ప్రకటించిన కరోనా ప్యాకేజీపై సునిశిత విమర్శలు చేసింది. ప్యాకేజీ చూడడానికి చాలా భారీగా కనిపిస్తున్నా.. వాస్తవంలో అది చాలా చిన్నదని తేల్చిచెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.