- ఘోర ప్రమాదం..వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి
Bus accident: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట
relaxation to employees: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రిలీవ్ అయిన 12 మంది ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వారికి 3 వారాల్లోపు పెండింగ్ జీతాలు చెల్లించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అలాగే సర్వీసు బ్రేక్ లేకుండా క్రమబద్ధీకరించాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏటీఎంలో రూ.4.95 లక్షలు నగదు తేడా...అనుమానం వచ్చి పరిశీలిస్తే..
DCC Bank ATM Robbery: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని డీసీసీ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో చోరీ జరిగింది. ఏటీఎంలో నగదు పెట్టేందుకు వెళ్లిన సిబ్బందికి లెక్కల్లో తేడా కనిపించింది. అనుమానం వచ్చి సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సినిమా టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా
AP High Court adjourned On Movie ticket Price Case: సినిమా టికెట్ల ధరలు.. సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన ప్రభుత్వం.. విచారణ రేపటికి వాయిదా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Varun Singh: మృత్యువుతో పోరాడి ఓడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్
Varun Singh: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సొంత చెల్లినే వివాహమాడిన అన్న.. ఎందుకంటే?
Brother Married His Sister: సొంత చెల్లినే వివాహం చేసుకున్నాడు ఓ అన్న. ఈ పెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి సామూహిక వివాహాల్లో జరగడం గమనార్హం. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Kenya Drought: మూగజీవాల మృత్యుఘోష- చుక్కనీరు లేక అల్లాడిపోయి..
Kenya Drought: కెన్యాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. తాగేందుకు చుక్కనీరు లేక వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. ఎక్కడికక్కడే కుప్పకూలి విగతజీవులుగా మారిపోతున్నాయి. ప్రాణాలు కోల్పోయి గుంపులు గుంపులుగా పడి ఉన్న జిరాఫీల దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అంచెలంచెలుగా ఎదిగి.. ఇప్పుడు 'షునెల్' సీఈఓగా భారతీయురాలు
Chanel Global CEO: ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలకు భారతీయులు వరుసగా సీఈఓలుగా ఎంపికవుతున్నారు. ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ పగ్గాలు చేపట్టగా.. తాజాగా భారత సంతతికే చెందిన లీనా నాయర్(52) ఈ జాబితాలో చేరారు. షునెల్ గ్లోబల్ సీఈఓగా ఆమె నియామకం అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సరైన సమాచారం లేకుండా కెప్టెన్సీ నుంచి తొలగించారు'
Virat Kohli ODI Captaincy: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడిన టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఫ్లాప్‌లతో డిప్రెషన్లోకి వెళ్లా.. చిరు అండతోనే మళ్లీ ఇలా'
Alitho Saradaga Actors Srikanth and Poorna: వరుస ఫ్లాప్‌లతో ఒకానొక సందర్భంలో డిప్రెషన్లోకి వెళ్లిపోయి సినీఇండస్ట్రీకి దూరంగా ఉండాలని తాను నిశ్చయించుకున్నట్లు తెలిపారు శ్రీకాంత్. కానీ ఆ తర్వాత చిరంజీవి చెప్పిన కొన్ని మాటలు తనలో స్ఫూర్తి నింపాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.