దేశవ్యాప్తంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచినప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్లు పెరుగుతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి దిల్లీలో స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సీట్ల సంఖ్య పెంచే అవకాశం లేదన్నారు. ఈ అంశంపై న్యాయ శాఖ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విభజన చట్టంలో ఇష్టం వచ్చినట్లుగా అంశాలను చేర్చారని మంత్రి పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్ అభివృద్ధితోపాటు కేంద్ర సంక్షేమ పథకాల అమలుపై మంత్రి సమీక్షించారు. ప్రజల సహకారంతో అక్కడి పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, ఏప్రిల్, మే నెలల్లో మరోసారి జమ్ముకశ్మీర్ వెళ్లి అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ కింద బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. దిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, అల్లర్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : విశాఖ పర్యటనలో చంద్రబాబు అరెస్టు