కొత్త పురపాలక సంఘాలు, నగర పంచాయతీల ఏర్పాటు ప్రతిపాదనలు మరోసారి తెరపైకి వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటికే 110 పురపాలక, నగరపాలిక సంస్థలు ఉన్నాయి. మరో 89 కొత్త పురపాలక సంఘాల ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు రూపొందించారు. వీటిలో నుంచి 50 పంచాయతీల హోదా పెంచే విషయమై తాజాగా పురపాలక, పట్టణ ాభివృద్ధి శాఖ తదుపరి పరిశీలనకు కలెక్టర్లకు పంపింది. కొన్ని చోట్ల ఒక పంచాయతీని, ఇంకొన్ని చోట్ల పంచాయతీ ప్రధాన కేంద్రంతో పాటు అనుబంధ గ్రామాలను కూడా కలిపి పురపాలక, నగర పంచాయతీగా ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో జనాభా, విస్తీర్ణం, ఆదాయ వనరులు, వివిధ రంగాల్లో అభివృద్ధి, మౌలిక వసతులు, భవిష్యత్తు అవసరాలు తదితర కోణాల్లో కలెక్టర్లు పరిశీలించి ప్రతిపాదిత పంచాయతీలకు ఎలాంటి స్థాయి కల్పించాలో సిఫార్సు చేయనున్నారు. పంచాయతీలకు పాలక వర్గాలు లేనందున ప్రత్యేక అధికారితో తీర్మానం చేయించి ప్రతిపాదనలు పంపనున్నారు. వీటిపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ,సూచనలు తీసుకుని తదుపరి చర్యలు చేపట్టనుంది. పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
తెరపైకి కొత్త పురపాలక సంఘాలు - panchayats
నూతన పురపాలక సంఘాలు, నగర పంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. 50 పంచాయతీల హోదా పెంచే విషయమై కలెక్టర్ల నివేదికను పురపాలకశాఖ కోరింది.