స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనపై జాయింట్ కలెక్టర్(జేసీ) ఆధ్వర్యంలో కలెక్టర్ ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక తుది దశకు చేరుకుంది. గురువారం నివేదికలోని అంశాలపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో కమిటీ చర్చించింది. ఇప్పటివరకు తయారు చేసిన హెల్త్ నివేదికను కలెక్టర్‌కు అందజేశారు కమిటీ సభ్యులు. పూర్తి స్థాయి నివేదికను శుక్రవారం అందజేసే అవకాశం ఉంది.
మరోవైపు స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో రమేష్ ఆసుపత్రికి చెందిన ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం, వారి బంధువులకు మొత్తం 10 మందికి సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు అందజేశారు. సౌత్ జోన్ ఏసీపీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులో తెలిపారు.
ఇదీ చదవండి
స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు