మహిళలందరికీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కమెడియన్లతో వైకాపా ప్రచారం చేయిస్తూ నగర ప్రజలను జోకర్లు చేస్తుందని విమర్శించారు. వైకాపాకి ఓటు వేస్తే రాజధాని మార్పు అంగీకరించినట్లేనన్నారు. సీపీఐ, తెదేపా అభ్యర్థులను గెలిపించి.. పులివెందుల రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. 36వ డివిజన్ అభ్యర్థి నక్కా వీరభధ్రరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ప్రచార యాత్ర చేపట్టారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ, భాజపా ఆధ్వర్యంలో 51, 52, 53వ డివిజన్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మహేష్ బాబు, అభ్యర్థులు రోడ్ షోలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం చివరిరోజు కావటంతో భారీగా రోడ్డు షోలు చేస్తూ.. వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.
ఇదీ చదవండి: