ETV Bharat / city

విజయవాడలో తెలుగు మహిళల నూతన కమిటీ ప్రమాణ స్వీకారం - బొండా ఉమ వార్తలు

వైకాపా పాలనలో మహిళలకు రక్షణ కరవైందని తెదేపా నేతలు వంగలపూడి అనిత, బొండా ఉమ విమర్శించారు. ప్రేమోన్మాదులు దాడులు చేసిన బాధిత కుటుంబాలకు.. నష్టపరిహారం చెల్లించి పాలకులు చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో తెలుగు మహిళ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు.

telugu mahila new committee
విజయవాడలో తెలుగు మహిళ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
author img

By

Published : Dec 3, 2020, 3:08 PM IST

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగు మహిళ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు ఎక్కువైపోయాయని వంగలపూడి అనిత విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్ సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దిశ చట్టాన్ని కేంద్రం తిరస్కరిస్తే దానికి జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ప్రేమోన్మాదులు దాడులు చేసిన బాధిత కుటుంబాలకు.. నష్టపరిహారం చెల్లించి పాలకులు చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. త్వరలో మహిళల రక్షణ కోసం తెలుగు మహిళ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు అనిత తెలిపారు.

వైకాపా పాలనలో రౌడీలు, సైకోలు, అసాంఘిక శక్తులు నిర్భయంగా రాష్ట్రంలో తిరుగుతున్నాయని బొండా ఉమ అన్నారు. శాంతి భద్రతల వైఫల్యంలో రాష్ట్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని ఎద్దేవా చేశారు. ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారని.. త్వరలోనే వైకాపా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

ఇవీ చదవండి..

కృష్ణాయపాలెం: చేతులకు సంకెళ్లతో రైతుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.