TDP Verification Committee on MLC driver's death: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై తెలుగుదేశం నిజనిర్ధరణ కమిటిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. కమిటీలో సభ్యులుగా పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్ బాబు, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.ఎస్ రాజు, పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పీతల సుజాత, పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావులను నియమించారు. మృతి ఘటనపై ఈ కమిటీ శనివారం కాకినాడలో పర్యటించనుంది.
ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డీజీపీ, జాతీయ సంస్థలకు నారా లోకేశ్ లేఖ రాశారు. జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ఎస్సీ కమిషన్‌లకు లేఖ రాసిన లోకేశ్.. ఎమ్మెల్సీని అరెస్టు చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుంటే.. అరాచకాలు పెరిగే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించాలని సూచించారు.
ఇవీ చదవండి: