నంద్యాలలో ముస్లిం కుటుంబాన్ని వైకాపా నేతల ప్రోద్బలంతో సీఐ సోమశేఖర్ రెడ్డి వేధింపులకు గురి చేశారని.. అందుకే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్ నజీర్ ధ్వజమెత్తారు. ముస్లిం కుటుంబం ఆత్మహత్యకు జగన్మోహన్ రెడ్డే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మైనార్టీలపై ఇన్ని దారుణాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏనాడూ బాధితులు, వారి కుటుంబాల తరఫున ఒక్క మాట కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. ముస్లిం వర్గాలపై జగన్ వైఖరేమిటో, ఆయన మౌనంతోనే అర్థమవుతుందన్నారు. నంద్యాల ఘటనపై వారం రోజుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే, ముస్లిం సంఘాలతో కలిసి చలో నంద్యాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'అబ్దుల్ కుటుంబ ఆత్మహత్యకు ప్రభుత్వానిదే నైతిక బాధ్యత'