TDP Photo Exhibition: తెదేపా హయాంలో నిర్మించిన.. టిడ్కో ఇళ్లపై తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నిర్మాణం పూర్తయినా జగన్ కక్షసాధింపు చర్యల వల్లే లబ్ధిదారులకు అందజేయలేదంటూ తెదేపా నేతలు విమర్శించారు. పది జిల్లాల్లో టిడ్కో ఇళ్ల ప్రస్తుత పరిస్థితి వివరిస్తూ ఫొటోలు ప్రదర్శించారు. ఈ ఫోటో ప్రదర్శనను అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ మంతెన సత్యన్నారాయణ రాజు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు తిలకించారు.
10 జిల్లాలో టిడ్కో ఇళ్ల దీన పరిస్థితిని వివరిస్తూ జిల్లాల వారీగా ఫోటోలను ప్రదర్శించారు. ఎన్నికల ముందు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తానంటూ ఇచ్చిన హామీని జగన్ విస్మరించారని మండిపడ్డారు నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3.16 లక్షల ఇళ్లు కట్టి 2.62 లక్షల ఇళ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉంచిందని వారు గుర్తు చేశారు.సెంటు భూమి పథకంలో వైకాపా ఎమ్మెల్యేలు 5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పేదలు ఇళ్లు కట్టుకోలేని విధంగా ఇసుక, సిమెంట్ ధరలు విపరీతంగా పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే గృహనిర్మాణం పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
"పేదలకు దక్కాల్సిన ఇళ్లను కూడా వైకాపా నేతలు అవినీతికి ఆదాయవనరుగా మార్చుకున్నారు. టిడ్కో ఇళ్లపై జగన్ రెడ్డి మాటతప్పి మడమ తిప్పారు. సెంటు భూమి పథకంలో వైకాపా ఎమ్మెల్యేలు 5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నివాసయోగ్యం కాని చోట పట్టాలు ఇవ్వటంతో అవి చెరువులను తలపిస్తున్నాయి. పేదలు ఇళ్లు కట్టుకోలేని విధంగా ఇసుక, సిమెంట్ ధరలు విపరీతంగా పెంచారు. ధైర్యం ఉంటే గృహనిర్మాణంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి."- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి
Kala Venkat Rao: రూ. 60 వేల కోట్లు ఏం చేశారో సమాధానం చెప్పాలి: కళా వెంకట్రావు