విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కృష్ణలంకలోని 20 డివిజన్లో తెదేపా కార్యాలయాన్ని ప్రారంభించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెదేపా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందని గద్దే రామ్మోహన్ అన్నారు. వైకాపా పేద ప్రజలకు డబ్బు చూపి ఓట్లు కొనాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈసీ