విచ్చలవిడిగా రోడ్లపై రచ్చ చేసే వైకాపా వాళ్లకు అడ్డురాని కొవిడ్ నిబంధనలు, లౌడ్ స్పీకర్లు, రైతుల మహా పాదయాత్రకే ఎలా అడ్డొచ్చాయో డీజీపీ సమాధానం చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. వైకాపా ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్న పోలీసులు అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తూ నోటీసులు జారీ చేయడం కొంతమంది పోలీసుల దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
-
విచ్చలవిడిగా రోడ్ల పై రచ్చ చేసే వైకాపా వాళ్లకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు, లౌడ్ స్పీకర్లు రైతుల మహా పాదయాత్రకే అడ్డొచ్చాయా డీజీపీ గారు. వైకాపా ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్న పోలీసులు అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తూ నోటీసులు జారీ చెయ్యడం..,(1/2) @APPOLICE100 pic.twitter.com/WiHZEmfyjC
— Lokesh Nara (@naralokesh) November 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">విచ్చలవిడిగా రోడ్ల పై రచ్చ చేసే వైకాపా వాళ్లకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు, లౌడ్ స్పీకర్లు రైతుల మహా పాదయాత్రకే అడ్డొచ్చాయా డీజీపీ గారు. వైకాపా ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్న పోలీసులు అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తూ నోటీసులు జారీ చెయ్యడం..,(1/2) @APPOLICE100 pic.twitter.com/WiHZEmfyjC
— Lokesh Nara (@naralokesh) November 6, 2021విచ్చలవిడిగా రోడ్ల పై రచ్చ చేసే వైకాపా వాళ్లకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు, లౌడ్ స్పీకర్లు రైతుల మహా పాదయాత్రకే అడ్డొచ్చాయా డీజీపీ గారు. వైకాపా ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్న పోలీసులు అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తూ నోటీసులు జారీ చెయ్యడం..,(1/2) @APPOLICE100 pic.twitter.com/WiHZEmfyjC
— Lokesh Nara (@naralokesh) November 6, 2021
అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణిచివేసేందుకు సీఎం జగన్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా చివరికి భంగపాటు తప్పదని హెచ్చరించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి అని లోకేష్ స్పష్టం చేశారు. తుగ్లక్ నిర్ణయాలతో రైతుల మహా పాదయాత్రకు అడ్డుకోవాలని చూస్తే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. రైతుల మాహాపాదయాత్ర, వైకాపా నేతల ర్యాలీల పట్ల పోలీసుల తీరును పోల్చుతూ ఓ వీడియోను తన ట్వీట్‌కు జత చేశారు.
ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో.. జోరుగా అమరావతి మహా పాదయాత్ర