ETV Bharat / city

రాజకీయ కోణంలో ఉపాధ్యాయుల బదిలీలు: అశోక్​బాబు - teachers transfers 2020 in AP news

ఉపాధ్యాయుల బదిలీలను రాజకీయ కోణంలో చూస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. అందువల్లే పాఠశాలల్లో 50శాతం ఖాళీలను బ్లాక్ చేశారని ఆరోపించారు. ఉపాధ్యాయులతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

tdp mlc ashok babu
tdp mlc ashok babu
author img

By

Published : Dec 16, 2020, 7:00 PM IST

ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని... దీనివల్ల జరగరాని నష్టం జరుగుతోందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ఉపాధ్యాయుల బదిలీలను రాజకీయ కోణంలో చూశారు కాబట్టే 50శాతం ఖాళీలను బ్లాక్ చేశారని ఆరోపించారు. ఈ చర్య అనేక అనుమానాలకు తావిస్తోందన్న ఆయన... పాఠశాలల నిర్వహణకు వైకాపా కార్యకర్తలకు అప్పగించే ఆలోచనలో ఉన్నారా అని నిలదీశారు.

సీఎం జగన్ మోసపు మాటలు నమ్మిన జాబితాలో ఉద్యోగ వర్గం కూడా చేరిందని అశోక్ బాబు విమర్శించారు. ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారంటూ డబ్బా కొట్టే నాయకుల మాట వింటే జగన్​కే తీవ్ర నష్టమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఉపాధ్యాయులతో చర్చించి.. వారి సమస్యలను జగన్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

ఉపాధ్యాయులను రోడ్డెక్కించిన చరిత్ర జగన్​ది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.