సీఎం, మంత్రులు ఇంట్లో ఉంటూ.. ఉద్యోగులు కార్యాలయానికి రావాలనడం కక్షసాధింపు కాదా అని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌పై సీఎం జగన్ నిర్లక్ష్యం వహించడం వల్ల.. ఇప్పటి వరకు దాదాపు 10 మంది ఉద్యోగులు మృతి చెందారని ఆరోపించారు. సచివాయల ఉద్యోగి పరమేష్.. కరోనాతో పోరాడుతూ మరణించడం బాధాకరమన్నారు.
ఇదీ చదవండి: 'స్వీయ జాగ్రత్తలు పాటిస్తే మూడో దశ ముప్పు తక్కువే'
తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం కాలు బయటపెట్టి ఎన్ని నెలలు అవుతోందో చెప్పాలని అశోక్‌బాబు నిలదీశారు. ఆరోగ్య శాఖ మంత్రి ఎన్ని ఆస్పత్రులను సందర్శించారో తెలపాలన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: